Kotta leka leka pata snehalu net nivasto savasam

Kotta leka leka pata snehalu net nivasto savasam

Kotta leka leka pata snehalu net nivasto savasam అందుబాటులోలేని కొత్త / పాత సహవాసం నెట్ నివాస్తో సావాసం. బాల్యంలో చదువుకున్నాం పెరిగాక చదువుపరమైన కారణాలు కానీ వృత్తి పరమైన కారణాలు కానీ సహవాసంలో అంతరాయం ఏర్పడింది. కొంతకాలం తరువాయి ఆ బాల్యస్నేహితుడిని కలిస్తే కలిగే ఆనందమే ఆనందం అనిపించవచ్చు.

ఆలాంటి ఆనందం ప్రోత్సహించే ఆన్ లైన్ అప్లికేషను పేస్ బుక్ ఖాతా తెరిచి చదువు, వృత్తి, అభిరుచులు మొదలైన వివరాలు పేస్ బుక్ ఖాతాకి జత చేస్తే, బాల్య స్నేహం కలిసే అవకాశంతో బాటు కొత్త స్నేహితులు పెరిగే అవకాశాలు పెక్కుగా ఉంటాయి.

పేస్ బుక్ ఖాతాదారుకి అతని వివరాలను బట్టి స్నేహితులను ఎంచుకోమని సలహా సూచనలు ఇస్తూ ఉంటుంది. ఆ సూచనలు అప్పటికే ఏర్పడిన ఖాతాదారు స్నేహితులను బట్టి వారి వారి స్నేహితుల జాబితాను చూపిస్తూ ఉంటుంది. లేక ఖాతాదారు చదువు, విద్యాలయ, నివాస, వృత్తి వ్యాపార ప్రదేశాలను బట్టి స్నేహితులను సూచిస్తుంది.

Snehitula, Aa Snehitula snehitlu, marala vari snehitula shnehitula snehitulu

అలా పేస్ బుక్ సూచించిన స్నేహితుల జాబితాలో కొత్త వ్యక్తి స్నేహితుడిగా మారితే, పేస్ బుక్ స్నేహ సలహా సూచనలు కొత్త స్నేహితుడి స్నేహితులను వారి స్నేహితులను సూచిస్తూ ఉంటుంది. తినమరిగిన మనసు పదే పదే తీపిపదార్ధాన్ని తిన్నట్టుగా పేస్ బుక్ స్నేహితులను సుచిస్తూనే ఉంటుంది. ఇక్కడ కొత్తగా పరిచయాలు పెరుగుతాయి.

ఇలా పేస్ బుక్ సూచనలను బట్టి స్నేహితులను కలుపుకుంటూ పొతే, మీతో బాటు మీ స్నేహితుల వివరాలు ఒక ప్రవాహం పల్లం ఎంతవరకు ఉంటే అంతవరకూ ప్రవహించినట్టు స్నేహితులు ఆ స్నేహితుల స్నేహితులు మరలా ఆ స్నేహితుల స్నేహితులకు వివరాలు స్నేహ అభ్యర్ధన సుచనలుగా సాగుతూ ఉంటాయి.

ఇలా పేస్ బుక్ పాత కొత్త సహవాసాలు ఏర్పరచడంలో సహాయం చేస్తూ నెట్ నివాసంతో సావాసం చేయిస్తూ ఉండడం పరిపాటి. ఇంకా పేస్ బుక్ పేజి, గ్రూప్, టైం లైన్ మొదలైన సదుపాయాలతో నెట్ వినియోగదారులను ఆకర్షిస్తూ, వ్యాపార సేవల విస్తృతికి కూడా ఉపయుక్తం అవుతుంది.

వాట్స్ అప్ మనకి తెలిసిన ఫోన్ నెంబర్ ఫోన్లో ఫీడ్ చేసుకుంటే సదరు ఫోన్ నెంబర్ ద్వారా ఆ వ్యక్తితో ఫోన్ ద్వారా సందేశాలు పంపుతూ ప్రత్యక్ష చాట్ చేయవచ్చు. గ్రూప్ క్రియేట్ చేసి అందులోకి పరిచయ మొబైల్ నెంబర్ల ద్వారా అనేకమందిని చేర్చి, ఒకేసారి అందరికి సందేశం పంపవచ్చు. అలాగే వీడియో సందేశాలు, ఆడియో సందేశాలు, వచన సందేశాలు, పద్య సందేశాలు సావాసలకి పంపవచ్చు. దూరంగా ఉన్న సావాసం సహవాసంగా మార్చేస్తుంది.

అందుబాటులో లేకుండా పోయిన సావాసం నెట్ ద్వారా సహవాసంగా మార్చేసి నెట్ మనిషికి సహవాసిగా మారిపోతుంది. నెట్ ద్వారా నెట్ పరికరాలు సహవాసిగా మారుతున్నాయి. మొదటగా ఉండేది మొబైల్. చేతిలో ఉంటుంది. ఎక్కడైనా ఎప్పుడైనా సావాసం కలిగిన వారితో సహవాసం చేయవచ్చు.

సావాసం చేయడానికి ఉపయోగపడుతూ మనతో సహవాసం చేసే స్మార్ట్ ఫోన్ వలన మనకి ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అప్పటికప్పుడు మాట్లాడడం అప్పటికప్పుడు షాపింగ్ చేయడం, అప్పటికప్పుడు వీడియో వీక్షించడం, అప్పటికప్పుడు న్యూస్ తెలుసుకోవడం, అప్పటికప్పుడు జరిగిపోయిన కార్యక్రమం ప్రత్యక్షంగా స్మార్ట్ ఫోన్లో వీక్షించడం మరిన్ని విషయాలలో సంతోషపరుస్తూ స్మార్ట్ ఫోన్ తన సహవాస పరిదిని మించిపోయింది.

Socila media valana smart phone viniyogam ekkuva ayite, smartphone features mari ekkuvaga yuvatanu akarshistayi.

ధన్యవాదాలు
NetNivas

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Close Menu