Blogging Technology Effective Web Viewing Things

ఓం గం గణపతయే నమః

Blogging Technology Effective Web Viewing Things

ఏదైనా విషయం లేక వస్తువు యొక్క ఉత్పత్తి సంస్థ లేక సేవా సంస్థల అఫిషియల్ వివరాల వెబ్ పేజిలు వెబ్ సైట్లలో ఉంచితే, వాటిపై వివరణలు విశ్లేషణలు మాత్రం Blog బ్లాగుల ద్వారా తెలియజేస్తారు. అలాగే సంభందిత విషయంపై లేక సేవపై ఆన్ లైన్లో ప్రమోట్ చేసే విధానం కూడా బ్లాగుల ద్వారా నిర్వహించబడుతుంది. Blogging technology effective web viewing things in online, and it used for promote things in online briefly. వీటి నిర్వహణ ఎక్కువగా బ్లాగ్గింగ్ అలవాటు ఉన్నవారు నిర్వహిస్తూ ఉంటారు.

అయితే (Blogs) బ్లాగ్స్ ఎక్కువగా ఆర్టికల్స్ కలిగి ఉంటుంది. వస్తువు లేదా సేవలపై వివరణలతో కూడిన విశ్లేషణలు ఆర్టికల్స్ గా బ్లాగులలో పోస్ట్ చేయబడతాయి. ఇంకా కొంతమంది ఔత్సాహికులు ఎంచుకున్న విషయాలపై వారికీ తెలిసిన విషయాలపై ఆర్టికల్స్ వారి వారి బ్లాగులలో పోస్టింగ్స్ చేస్తుంటారు.

Blogging very powerful and famous for article postings about products or services or organizations or company promotion in online. బ్లాగ్గింగ్ ఉత్పత్తుల లేక కంపెనీల సేవలు వాటి గురించి ఆర్టికల్స్ వ్రాసి, వాటిని ప్రమోట్ చేసే, సమర్ధవంతమైన పోస్టింగ్ విధానం. ఎక్కువమంది బ్లాగ్గింగ్ నిర్వహిస్తూ ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి జీతం కన్నా ఎక్కువ లేక కొన్ని రెట్లు ఎక్కువ డబ్బు సంపాదించే బ్లాగర్స్, కొంతమంది ఉంటారు. చాలా మంది డబ్బు సంపాదించడానికి, ఎంచుకునే ఆన్ లైన్ మార్గాలలో బ్లాగ్గింగ్ ప్రధానమైనది. Quality and reliable content for needed things to whom, best chance to earning money in online. అర్ధవంతమైన అంశాలతో ఎక్కువమందికి ఉపయోగపడే విషయాలతో కూడిన కంటెంట్ ఉంటే, ఆన్ లైన్లో బ్లాగ్గింగ్ ద్వారా డబ్బు సంపాదించే అవకాశాలు ఎక్కువ అని చెప్పవచ్చు.

How To Create Blog, How Much Cost to Blogging

బ్లాగు ప్రారంభించాలంటే ఏమి ఖర్చులేకుండా కేవలం ఇమెయిల్ ఎకౌంటు ద్వారా బ్లాగు ప్రారంభించవచ్చు. ఉచితంగా బ్లాగు సృష్టించే అవకాశాలు కొన్ని ఆన్ లైన్ సంస్థలు అందిస్తున్నాయి. అయితే ముందుగా ఆ సంస్థ యందు ఎకౌంటు రిజిస్టర్ చేసుకుని బేసిక్ ఉచిత ప్లాన్లో బ్లాగు సృష్టించవచ్చు. (Blogging free in basic plans with limited features only). పరిమితమైన సర్వర్ స్పేస్, సబ్ డొమైన్, పరిమిత సదుపాయాలు కలిగిన ప్రాధమిక పధకాలు ఉచితంగా లభిస్తాయి. ఇందులో సర్వర్ స్పేస్ అంటే బ్లాగులో పోస్ట్ చేసే ఆర్టికల్, ఫోటోలు, మ్యూజిక్ ఫైల్స్, వీడియో ఫైల్స్ మొదలైనవి వాటితో కలసిన మీ బ్లాగ్ డేటాని ఆన్ లైన్ సర్వర్లో మీ బ్లాగ్ పేరు మీదనే సేవ్ అవుతుంది. మీరు బ్లాగ్గింగ్ చేస్తున్నప్పడు మీకు కేటాయించిన స్పేస్ నిండిపోతే, మీరు ప్రాధమిక ప్లాన్ నుండి అప్ గ్రేడ్ అవ్వవలసి ఉంటుంది.

సబ్ డొమైన్ ఉచిత బ్లాగ్ ప్రొవైడర్ డొమైన్ పేరుకు ముందు మీ బ్లాగ్ పేరు (.dot) కలపబడి ఉంటుంది. ఉదా: గూగుల్ బ్లాగర్ ప్లాట్ ఫారం మీరు బ్లాగ్గింగ్ చేయడానికి ఎంచుకుంటే కనుక మీ సబ్ డొమైన్ ఇలా ఉంటుంది. yourblog.blogspot.com అండర్ లైన్ చేసిన మొదటి పదం యువర్ బ్లాగ్ అనే పదం మీ బ్లాగు పేరు అయితే, బ్లాగ్ స్పాట్ అనే రెండవ పదం బ్లాగ్ ప్రొవైడర్ డొమైన్ పేరు, .com అనేది డొమైన్ ఎక్స్టెన్షన్.

Google Blogger

అలా ఉచితంగా Blogging Platform బ్లాగ్ చేయడానికి కావాల్సిన వెబ్ సోర్స్ అందించే వాటిలో ముందుగా blogger.com, ఇది గూగుల్ సంస్థ వారిచే అభివృద్ధి చేయబడిన బ్లాగ్గింగ్ ప్లాట్ ఫారం. ఎవరైనా జిమెయిల్ ఎకౌంటుతో blogger.com వెబ్ సైట్లో రిజిస్టర్, ఉచితంగా మీరు ఎంచుకున్న అంశంపై బ్లాగు సృష్టించవచ్చు. వెబ్సైటు తయారుచేయాలంటే వెబ్ స్క్రిప్ట్స్ తెలిసి ఉండాలి, కానీ ఈ బ్లాగ్గింగ్ స్క్రిప్టింగ్ తెలియాల్సిన అవసరం లేదు. కేవలం ఒక బ్రౌజర్లో స్వయంగా బ్రౌజింగ్ చేసుకోగలిగే విధానం బాగా వచ్చి ఉంటే చాలు. Blogger best for non-technical persons. ప్రాధమికంగా కోడింగ్ తెలియనివారు, ముందుగా గూగుల్ బ్లాగరును ఎంచుకోవడం ఉత్తమం అని ప్రామాణిక బ్లాగ్గర్స్ అభిప్రాయం.

Wix

పూర్తిగా స్మార్ట్ ఫోను వాడినట్లుగా వెబ్ పేజిలు సృష్టించాలంటే, Wix వెబ్ సైట్ నందు ఏదేని ఒక మెయిల్ ఎకౌంటుతో రిజిస్టర్ అయ్యి, సులభంగా ప్రాధమిక ప్లాన్లలో బ్లాగ్ సృష్టించవచ్చు. ఎందుకు సులభం అంటే ఇది స్మార్ట్ ఫోన్లో గేమ్ ఆడాలంటే, ఆ గేమ్ సూచనల మేర మొబైల్ స్క్రీనుపై సూచనలు అనుసరిస్తాము. అలగే ఇక్కడ మౌస్ తో పట్టుకొని లాగడం, కావాల్సిన చోట పెట్టడం (Drop & Drag) వలన వెబ్ పేజి చాల తేలికగా సృష్టించవచ్చు. మొబైల్ ఫోన్లో అప్ షార్ట్ కట్స్ హోం స్క్రీనుపైకి తెచ్చినట్లు. ఈ విధానంగా బ్లాగ్గింగ్ టూల్స్ అందించే సంస్థ వెబ్ సైట్ wix.com.

WordPress

ఇంకా లెక్కలు బాగా వచ్చినవారికీ లెక్కలు పరిక్ష ఎదురైతే ఎలా ఉంటుందో, వెబ్ స్క్రిప్ట్స్ తెలిసినవారికి (WordPress) వర్డ్ ప్రెస్ అయిన అంతే. అంతలా బ్లాగ్గింగ్ విధానంలో తనదైన ముద్ర వేసి అనేకమంది బ్లాగర్స్ పాలిట కల్పవృక్షమే అయ్యింది. WordPress very very popular in blogging to describe about world things of world in online. HTML మరియు CSS కోడింగ్ తెలిస్తే వర్డుప్రెస్సులో బ్లాగ్గింగ్ చేయడం ఇంకా తేలిక అవుతుంది. ఇక్కడ ప్రాధమిక పధకం, ధర నిర్ణయించిన పధకాలు కలవు. ప్రాధమిక పధకం ఉచితం కానీ పరిమితులు ఉంటాయి. సదుపాయాలు అన్ని పరిమితం మాత్రమే.

WordPress అంటే గుర్తుకు వచ్చేది థీమ్స్ మరియు ప్లగ్ ఇన్స్, వీటి ద్వారా ఒక మంచి విషయాన్ని చాల అర్ధవంతంగా, మంచి లుకింగ్ వెబ్ పేజిలు సృష్టించవచ్చు.  అసలు WordPress బ్లాగ్ విషయాలపై బ్లాగులు సృష్టించి, డబ్బు సంపాదిస్తున్న బ్లాగులు చాలానే ఉన్నాయి. అలా WordPress బ్లాగ్ టిప్స్ అందించే బ్లాగ్ shoutmeloud.com. బాగా ప్రాచుర్యం పొందిన బ్లాగ్. ఇలా చాలానే blogger.com గురించి టిప్స్ అందించే బ్లాగ్స్ చాలానే ఆన్ లైన్లో ఉంటాయి.

ఉచితంగా లేక ధర చెల్లించే పధకాలలో బ్లాగ్గింగ్ టూల్స్ అందించే సంస్థలు ఇంకా ఉన్నాయి. అవి Tumblr, Medium, Squarespace, Joomla, Ghost, Weebly and more. మొదలైనవి.

ఇంకా బ్లాగుల విషయాలు తరువాయి పోస్టులలో !

ధన్యవాదాలు

నెట్ నివాస్

Author: bpr

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.